Header Banner

తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు! శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందడి! ఎప్పటి నుండి అంటే..

  Tue Apr 01, 2025 09:32        Devotional

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండగా, ఆదివారం నాడు 62,263 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,733 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క రోజే 3.65 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోగా, టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను టీటీడీ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వివిధ వాహన సేవలు, ధ్వజారోహణ, గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం నిర్వహించబడతాయి.

 

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సహా పలువురు మంత్రులు పాల్గొంటారు. భాకారాపేటలో భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, టీటీడీ అధికారులు, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పటిష్ట ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక వద్ద అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, అన్నప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుల లిస్ట్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ! పదవులు మాత్రం వారికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త మార్పులు! రేపటి నుండి అమలు... తప్పకుండా తెలుసుకోండి!

 

వైసీపీకి మరో షాకింగ్ న్యూస్! కీలక నేత రాజీనామా.. బీజేపీలోకి ఎంట్రీ!

 

పెన్షన్ దారులకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు! నేటి నుండి వారికి అకౌంట్ లో డబ్బులు జమ!

 

మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు బిగ్ షాక్! ఏప్రిల్-మేలో 32 రైళ్లు రద్దు.. రైల్వే కీలక ప్రకటన!

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ttd #latestnews #TirumalaDarshan #TirupatiRevenue #Brahmotsav2025 #TTDArrangements #SriRamNavamiCelebrations